'అర్జున్ రెడ్డి' చూసి నేను సిగ్గుప‌డాలి

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 05:42 PM

'అర్జున్ రెడ్డి' చూసి నేను సిగ్గుప‌డాలి

ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి రూపొందించిన `అర్జున్‌రెడ్డి` సినిమాతో దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ సినిమాలో విజ‌య్ న‌ట‌న‌కు సామాన్యులే కాకుండా సినీ ప్ర‌ముఖులు సైతం ఫిదా అయిపోయి ప్ర‌శంస‌లు కురిపించారు. ఆ సినిమాలో మాస్ లుక్‌తో ఆక‌ట్టుకున్న విజ‌య్.. ఆ త‌ర్వాత వ‌చ్చిన `గీత‌గోవిందం`లో క్లాస్ న‌ట‌న‌తో మెప్పించాడు. ప్ర‌స్తుతం `డియ‌ర కామ్రెడ్‌` సినిమాలో న‌టిస్తున్న విజ‌య్ త‌న కెరీర్ గురించి ఓ ఆంగ్ల ప‌త్రిక‌తో మాట్లాడాడు.

'ఇంకొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా 'అర్జున్ రెడ్డి' నా ఉత్త‌మ చిత్రం అని చెప్పుకుంటే నేను న‌టుడిగా ఎద‌గ‌లేన‌ట్టే. కొన్ని రోజుల త‌ర్వాత `అర్జున్ రెడ్డి`లో నా నాట‌న చూసి నేను సిగ్గుప‌డాలి. 'అర్జున్‌రెడ్డి' అంటే సిగ్గుప‌డే (న‌ట‌న‌లో మెరుగుద‌లను ఉద్దేశిస్తూ) స్థాయికి చేరుకోవాలి. ప్ర‌తీ సినిమాకు న‌టుడిగా ఎద‌గాలన్న‌దే నా ల‌క్ష్యం` అని విజ‌య్ చెప్పాడు.

Untitled Document
Advertisements