ఏపీలో రీపోలింగ్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 10:00 AM

ఏపీలో  రీపోలింగ్

ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాక ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు రంగం సిద్ధమైంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో రీపోలింగ్ జరపాల్సిన కేంద్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. రీపోలింగ్ నిర్వహించుకోవడానికి ఆదేశాలు జారీచేసింది. మే 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయా బూత్‌ల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి నియోజవకర్గంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి మే 10, 11 తేదీల్లో విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని ఎన్నికల అధికారులతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు అనుమతివ్వాలని ఈసీని కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను పరిశీలించిన ఈసీ చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో రీపోలింగ్‌కు అనుమతులు జారీచేసింది.





Untitled Document
Advertisements