కొత్త ఛానెల్ పెట్టె ఆలోచనలో రవి ప్రకాష్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 11:17 AM

కొత్త ఛానెల్ పెట్టె ఆలోచనలో రవి ప్రకాష్

అనుకోకుండా టీవీ9 ఛానల్ నుండి బయటకు వచినటువంటి మాజీ సీఈవో రవిప్రకాష్ తాజాగా ఒక మీడియా సంస్థకి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన రవిప్రకాష్… తానూ రాజకీయ పార్టీలందరికి కూడా వ్యతిరేకంగా పని చేశామని, ఏ ఒక్క పార్టీకి కూడా మద్దతూ తెలపలేదని, నీతిగానే మా ఛానల్ ని ప్రసారం చేసుకుంటూ వచ్చామని, అది సహించలేకే కొందరు తెలంగాణ పెద్ద నాయకులూ తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, త్వరలోనే నిజానిజాలు అన్ని కూడా ప్రజలు తెలుసుకుంటారని రవిప్రకాష్ అన్నారు. అయితే తానూ టీవీ9 ఛానల్ ని అన్నింటికంటే ముందంజలో నిలబెట్టామని, అంతేకాకుండా ఇతర తెలుగు చానళ్ల లాగా తాము మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను ప్రోత్సహించమని అన్నారు. అయితే టీవీ9 చానల్ పై కన్నేసిన ‘మై హోం’ జూపల్లి రామేశ్వర్ రావు అలంద మీడియా సంస్థ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసి టీవీ9 లోకి చొరబడ్డాడని ఆరోపించారు.

కాగా ప్రస్తుత బాధ్యతలు చేపట్టిన రామేశ్వర్ రావు టీవీ9 చానల్లో చాలా మార్పులు తీసుకొస్తారని, తాము 15 ఏళ్లుగా పడ్డ కష్టాన్ని అంత కూడా నాశనం చేసే అవకాశం ఉందని రవిప్రకాష్ అన్నారు. కాగా టీవీ9 ఛానల్ ని ఎప్పటిలాగే ప్రసారం చేస్తే తనకు కాస్తైనా ఆత్మ సంతృప్తి ఉంటుందని ఆయన అన్నారు. అయితే తనపై మరిన్ని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని కోరుకుంటున్నారని, తానో జర్నలిస్టునని, చివరి వరకు కూడా పోరాటం సాగిస్తానని రవిప్రకాష్ అన్నారు. అయితే తానూ టీవీ9 లోనే కొనసాగుతానని, అది కుదరకపోతే మరొక ఛానల్ ని పెట్టి చాలా అభివృద్ధి చేస్తానని రవిప్రకాష్ అన్నారు.

Untitled Document
Advertisements