'మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌' బడ్జెట్ ఫోన్ రిలీజ్

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 10:44 AM

'మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌' బడ్జెట్ ఫోన్ రిలీజ్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తాజాగా భారత మార్కెట్‌లోకి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌'ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని ఏర్పాటు చేశారు. 128 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే.. 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. కేవలం రూ.4,999 ధరకే లభ్యమయ్యే ఈ ఫోన్ రియల్‌మి సి2, షావోమీ రెడ్‌మి 6ఎ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ ఫీచ‌ర్లు:
✪ 5.45 ఇంచ్ డిస్‌ప్లే,
✪ 540 x 1132 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
✪ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌,
✪ ఆండ్రాయిడ్ 9.0 పై
✪ 2 జీబీ ర్యామ్‌,
✪ 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
✪ 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
✪ డ్యుయ‌ల్ సిమ్‌,
✪ 4జీ సపోర్ట్
✪ బ్లూటూత్ 4.2
✪ 2200 ఎంఏహెచ్ బ్యాట‌రీ.





Untitled Document
Advertisements