కోహ్లీ స్లో పాయిజన్!!

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 11:35 AM

కోహ్లీ స్లో పాయిజన్!!

ముంభై: టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై జట్టు మాజీ మానసిక వైద్యుడు ప్యాడీ ఆప్టన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ స్లో పాయిజన్ లాంటి వాడని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. 2011 ప్రపంచకప్ సమయంలో భారత జట్టుకు మానసిక శిక్షకుడిగా సేవలందించిన ఆప్టన్ ఆ సమయంలో కోహ్లీని చాలా దగ్గరగా చూశాడు. కోహ్లీ ఏ ఫార్మాట్‌లోనైనా బ్యాటింగ్‌కు దిగే ముందు తాను ఏం చేయాలనుకుంటాడో దాన్ని ముందే నిర్ణయించుకుంటాడని చెప్పాడు. అలాంటి ఆటతీరే అతనికి దొరుకుతుందని, దాన్ని మ్యాచ్ అంతటికీ కొనసాగిస్తాడని చెప్పాడు. ‘అయితే ధోనీ దీనికి పూర్తి విరుద్ధం. అతను కొన్ని సార్లు వెనుకబడినా చివరి నిమిషంలో ఎదురు తిరుగుతాడు. కానీ కోహ్లీ స్లోపాయిజన్‌లాంటోడు. తనకు ఎన్ని పరుగులు అవసరమో అన్నే ప్రయత్నిస్తాడు. ఒక వేళ ఓవర్‌కు ఏడు పరుగులు అవసరమైతేఅలా ఏడు పరుగులకు తగ్గకుండా, పెరగకుండా ఆడతాడు. ప్రత్యర్థులకు అవకాశమే ఇవ్వడు’ అని ఆప్టన్ పేర్కొన్నాడు.





Untitled Document
Advertisements