కప్ ఆసిస్ దే: గంభీర్

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 02:31 PM

కప్ ఆసిస్ దే: గంభీర్

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్ పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీలో అన్ని టీమ్‌లో మూడు జట్లు తన ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయని కాని ఈ సారి వరల్డ్ కప్ కొట్టేది మాత్రం ఆస్ట్రేలియా అని జోస్యం చెప్పారు. ఆసీస్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందన్నారు. ఇంగ్లాండ్‌కు మాత్రం స్వదేశీ పిచ్‌లపై ఆడటమే అనుకూల అంశంగా ఉందని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ జట్టు గతంతో పోలిస్తే బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉందని తెలిపారు. ఇంగ్లాండ్‌కు అదనపు బలం మాత్రం ఆల్‌రౌండర్లు అని చెప్పికొచ్చాడు. ఫైనల్‌లో ఆసీస్‌తో టీమిండియా లేదా ఇంగ్లాండ్ ఆడుతుందన్నారు. వరల్డ్ కప్ గెలువాలంటే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తారని గౌతమ్ తెలిపారు. భారత జట్టుకు బుమ్రా ఎక్స్ ఫ్యాక్టర్‌లా కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో గంభీర్ శ్రీలంకపై 97 పరుగులు చేసి ప్రపంచ కప్ రావడంలో కీలక వ్యక్తిగా మారాడు.





Untitled Document
Advertisements