అబార్షన్ నిషేధం వివాదంపై ట్రంప్ స్పందన!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 11:41 AM

అబార్షన్ నిషేధం వివాదంపై ట్రంప్ స్పందన!

వాషింగ్టన్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అబార్షన్ మీద కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టాలు చేసిన నేపథ్యంలో దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తాజాగా తన అభిప్రాయాలూ చెప్పారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో వరుసగా పోస్టులు చేశారు. ''నేను ప్రాణి-అనుకూలవాదిని. ప్రాణం నిలబెట్టాలనే వాదనను నేను బలంగా సమర్థిస్తాను. అయితే, అందుకు మూడు మినహాయింపులు ఉన్నాయి. అత్యాచారం, వావివరుసలేని సంబంధాలు, తల్లి ప్రాణాలను రక్షించటం ఆ మినహాయింపులు. ఇది రొనాల్డ్ రీగన్ అనుసరించిన వైఖరి'' అని పేర్కొన్నారు.''గత రెండేళ్లలో 105 మంది అద్భుతమైన కొత్త ఫెడరల్ జడ్జిలతో (ఇంకా చాలా మంది రాబోతున్నారు), ఇద్దరు గొప్ప కొత్త సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మనం చాలా ముందుకు వచ్చాం. జీవన హక్కకు సంబంధించి పూర్తిగా కొత్త సానుకూల దృక్పథం వచ్చింది'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.''మనం సమైక్యంగా ఉండాలి.. ప్రాణం కోసం 2020లో గెలవాలి'' అని ట్రంప్ ట్వీట్ చేశారు.మసాచుసెట్స్ సెనెటర్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎలిజబెత్ వారెన్.. అలబామా అబార్షన్ నిషేధం మీద స్పందిస్తూ.. ''ఈ నిషేధం ప్రమాదకరం. అత్యంత క్రూరమైనది. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిప్పికొట్టటం ఈ బిల్లు రచయితల కోరిక'' అని పేర్కొన్నారు.''ఆ అమెరికాలో నేను నివసించాను. అందుకే చెప్తున్నా.. మనం వెనక్కి వెళ్లబోవటం లేదు. నేడు కాదు.. ఎన్నడూ వెనక్కి వెళ్లేది లేదు. మనం గెలుస్తాం'' అని చెప్పారు.





Untitled Document
Advertisements