బుమ్రా బౌలింగ్ లో ఇంత సైన్స్ ఉందా!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 12:31 PM

బుమ్రా బౌలింగ్ లో ఇంత సైన్స్ ఉందా!

హైదరాబాద్: టీంఇండియా అత్యుత్తమ బౌలర్లలో ఒకడు జస్ప్రీత్‌ బుమ్రా. తన బౌలింగ్ తో ఎంతటి క్రికెట్ నిపునుడైనా పెవిలియన్ బాట పట్టించే శక్తి బుమ్రాకు ఉంది. అయితే, బుమ్రా బౌలింగ్ విజయం వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ-కాన్పూర్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ మిట్టల్‌ కనిపెట్టానని అంటున్నారు. మిట్టల్ తన స్టడీలో బుమ్రా స్పీడ్, సీమ్ పొజిషన్ వెనుక రాకెట్‌ సైన్స్‌ దాగి ఉందని చెబుతున్నారు. బుమ్రా రివర్స్‌ మాగ్నస్‌ ఫోర్స్‌ను రాబట్టి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన స్టడీలో తేలిందని చెప్పారు. 1,000 RPMతో బుమ్రా బంతులు వేస్తున్నాడు కాబట్టి 0.1 స్పిన్ నిష్పత్తిలో ఆ బంతికి స్పిన్ తోడవుతుందని తెలిపారు.వేగంతో పాటు సీమ్‌ కలిగిన బుమ్రా విసిరే బంతికి స్పిన్‌ తోడవడంతో బంతి దిశ మారి మాగ్నస్‌ ఫోర్స్‌ కాస్త రివర్స్‌ మాగ్నస్‌ ఫోర్స్‌గా రూపాంతరం చెందుతుందని ఆయన వెల్లడించారు. దీనివల్ల బంతి నేలను తాకిన తర్వాత అనూహ్యంగా బౌన్స్‌ అవుతుందని అన్నారు. బుమ్రా యాక్షన్ భిన్నంగా ఉండటానికి ఇది దోహదపడుతుందని అన్నారు.





Untitled Document
Advertisements