ఫిట్‌నెస్ వేటలో పాండ్యా!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 03:56 PM

ఫిట్‌నెస్ వేటలో పాండ్యా!

ముంభై: మే 30న ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కోసం టీంఇండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో పాండ్య అద్భుత ప్రతిభను కనబర్చారు.ఆటగాళ్లందరూ బాగా అలసిపోయి ఉండటంతో ప్రపంచకప్‌ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్‌నెస్‌ కోసం వెచ్చిస్తున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను పాండ్య సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్ ముందు ఎలాంటి విశ్రాంతి తీసుకోవడంలేదంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో నెటిజన్లు పాండ్యాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Untitled Document
Advertisements