తనకు తానే శిక్ష వేసుకున్న సాధ్వీ ప్రజ్ఞా సింగ్

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 06:16 PM

తనకు తానే శిక్ష వేసుకున్న సాధ్వీ ప్రజ్ఞా సింగ్

వివాదాస్పద నేత, భోపాల్ లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇటీవల తన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా సెగలుపొగలు సృష్టిస్తున్నారు. చనిపోయిన యాంటీ టెర్రరిస్టు అధికారి హేమంత్ కర్కరే నుంచీ, జాతిపితను చంపిన నాథూరామ్ గాడ్సే వరకు సాధ్వీ వ్యాఖ్యల్లో ప్రస్తావనకు వచ్చారు. కర్కరేపై వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకున్న సొంత పార్టీ నేతలు, గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడు అన్న వ్యాఖ్యను మాత్రం తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రజ్ఞా సింగ్ ను క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న విషయాన్ని గమనించిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం నుంచి 63 గంటల పాటు నిరవధిక మౌన వ్రతం చేపట్టారు. ఈ మేరకు సాధ్వీ ట్వీట్ చేశారు. తాను ఈ మౌన వ్రతం సమయంలో కఠోర తపస్సు చేస్తానని, ధ్యానముద్రలో ఉంటానని తెలిపారు.

Untitled Document
Advertisements