ఫేస్‌బుక్‌ క్రిప్టో కరెన్సీ!

     Written by : smtv Desk | Tue, May 21, 2019, 12:12 PM

ఫేస్‌బుక్‌ క్రిప్టో కరెన్సీ!

అందరూ ఊహిస్తున్నట్టుగానే ఫేస్‌‌‌‌బుక్‌‌ క్రిప్టో కరెన్సీ తీసుకురావడం దాదాపు ఖాయమైపోయింది. బిట్‌‌కాయిన్‌‌కు దీటుగా ఫేస్‌‌బుక్‌‌ ఓ డిజిటల్‌‌ కరెన్సీని తీసుకొస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వాటికి బలం చేకూరుస్తూ రీసెంట్‌‌గా స్విట్జర్లాండ్‌‌లో ‘లిబ్రా నెట్‌‌వర్క్‌‌’ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసింది ఫేస్‌‌బుక్‌‌. అందులో పేమెంట్స్‌‌, బ్లాక్‌‌ చెయిన్‌‌ సిస్టమ్‌‌ గ్రూప్‌‌ను డెవలప్‌‌ చేస్తారు. స్విస్‌‌కు చెందిన సీ నెట్‌‌ మీడియా సంస్థ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. ఈ కరెన్సీ బిట్‌‌కాయిన్ మాదిరి తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాదని, యూఎస్‌‌ డాలర్‌‌ మాదిరి స్థిరంగా మార్కెట్‌‌లో చెలామణి అవుతుందని చెప్పింది. ‘కొన్ని వారాల క్రితం జెనీవాలో లిబ్రా నెట్‌‌వర్క్‌‌ సంస్థను ఫేస్‌‌బుక్‌‌ ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా డిజిటల్‌‌ కరెన్సీకి సంబంధించిన సాఫ్ట్‌‌వేర్‌‌, హార్డ్‌‌వేర్‌‌, కరెన్సీ సంబంధ పేమెంట్స్‌‌, బ్లాక్‌‌ చెయిన్‌‌ అనాలసిస్‌‌, బిగ్‌‌డేటా లాంటి వాటిపై రీసెర్చ్‌‌ చేస్తోంది’ అని పేర్కొంది. దీనిపై ఫేస్‌‌బుక్‌‌ అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు. ఫేస్‌‌బుక్‌‌ నెల రోజులుగా డజన్ల కొద్ది ఆర్థిక సంస్థలు, ఆన్‌‌లైన్‌‌ వ్యాపారస్తులతో చర్చలు జరుపుతోందని, కొత్త కరెన్సీ తీసుకొస్తుందనేందుకు ఇది సంకేతమని వాల్‌‌స్ట్రీట్‌‌ జర్నల్‌‌ తెలిపింది. ఓ 50 మంది నిపుణులు ఈ వర్చువల్ కరెన్సీ తయారీపై పనిచేస్తున్నారని గత ఫిబ్రవరిలోనే ‘ద న్యూయార్క్‌‌ టైమ్స్‌‌’ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 238 కోట్ల మంది ఫాలోవర్స్‌‌ ఉన్న ఫేస్‌‌బుక్‌‌ క్రిప్టోకరెన్సీతో మరింత దూకుడు పెంచనుందని మార్కెట్‌‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.





Untitled Document
Advertisements