అమ్మాయి మీద చెయ్యేస్తే.....వెంటనే ఫోన్‌లో నుంచి ఈ శబ్దం వినబడుతుంది

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 01:37 PM

అమ్మాయి మీద చెయ్యేస్తే.....వెంటనే ఫోన్‌లో నుంచి ఈ శబ్దం వినబడుతుంది

అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నప్పటికీ.. టోక్యోలోని చాలా మంది అమ్మాయిలు స్పందిస్తే ఏమవుతుందోనని సైలెంట్‌గానే ఉంటున్నారు. తాను స్పందిస్తే ఏ సమస్య వచ్చి పడుతుందో అనే ఆందోళనతో.. ఆకతాయిలు ఏడిపిస్తున్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఇలాంటి అమ్మాయిల కోసమే టోక్యో పోలీసులు ఓ స్మార్ట్ యాప్‌ను రూపొందించారు.

ఆ యాప్ ప్రత్యేకత ఏంటంటే.. ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఆకతాయి ఎవరైనా అమ్మాయిని లైంగికంగా వేధించాడంటే వెంటనే ఆ యాప్ నుంచి ‘స్టాప్ ఇట్’ అనే మెసేజ్ వినిపిస్తుంది. ఈ శబ్దం ద్వారా చుట్టు పక్కల ఉన్న వారికి అమ్మాయి ఆపదలో ఉన్నట్టు అర్థమవుతుంది. వెంటనే అమ్మాయిని ఆకతాయి నుంచి కాపాడే అవకాశముంటుంది.

ఈ యాప్‌కు టోక్యో వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ యాప్‌ను 2 లక్షల 37 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని.. ప్రతి నెలా మరో పది వేల డౌన్లోడ్స్ పెరుగుతున్నట్టు తెలిపారు. ఒక్క 2017లోనే టోక్యో రైళ్లలో, సబ్‌వేలలో అమ్మాయిలపై లైంగిక వేధింపుల కేసులు 900కు పైగా నమోదైనట్టు అధికారులు చెప్పారు. మొదటగా ఈ యాప్‌ను వృద్దులు, తల్లిదండ్రులు వారి పిల్లల కోసం రూపొందించారు. స్కామ్‌లు, దొంగతనాలకు సంబంధించిన సమాచారం కోసం మొదటగా తయారుచేసినప్పటికీ.. తరువాత అమ్మాయిల భద్రత కోసం ప్రత్యేక ఆప్షన్‌ను జత చేశారు.





Untitled Document
Advertisements