గూగుల్‌కి షాకిచ్చిన హువావే

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 01:50 PM

గూగుల్‌కి షాకిచ్చిన హువావే

చైనాకు చెందిన హువావేపై వరుసాగా వేటు పడుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో అక్కడి కంపెనీలు వరుసబెట్టి హువావే కంపెనీతో వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇందుకు నాంది పలికింది. అయితే హువావే కంపెనీ మాత్రం దేనికి బెదరడం లేదు. తాజాగా గూగుల్‌కే షాకిచ్చింది. హువావే ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా సరికొత్త వినూత్నమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తోందని చైనా మీడియా పేర్కొంటోంది. ఇది గూగుల్‌కు పెద్ద షాకే అని చెప్పాలి. అలాగే ఐఓఎస్‌కు పోటీ తప్పేలా లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లే ఉన్న విషయం తెలిసిందే. ఇవి రెండు గూగుల్, యాపిల్‌కు చెందినవి. రెండూ అమెరికా కంపెనీలే. సొంతం ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పనతో హువావే ఒకేసారి గూగుల్, యాపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చింది. హువావే ఓఎస్ పేరు హాంగ్‌మెంగ్ అయ్యి ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. హువావే 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తోందని తెలిపాయి. ఈ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే క్రమంగా తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో ఈ ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందని పేర్కొన్నాయి.





Untitled Document
Advertisements