తుది శ్వాస విడిచిన ఫార్ములా వన్‌ లెజెండ్‌ నికీ లాడా

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 02:00 PM

తుది శ్వాస విడిచిన ఫార్ములా వన్‌ లెజెండ్‌ నికీ లాడా

ఫార్ములా వన్‌ రేసర్ నికీ లాడా(70) కన్నుమూశారు. ఈయన గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడతు సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 1949లో ఆస్ట్రియాలో జన్మించిన నికీ.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఫార్ములా వన్‌ రేసింగ్‌ను తన కేరీర్‌గా ఎంచుకున్నారు.మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నికీ.. 1975, 1977, 1984లో టైటిల్స్‌ సొంతం చేసుకున్నారు. 1976లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన తోటి రేసర్ల సాయంతో తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. అయినా కేవలం ఆరువారాల్లోనే కోలుకొని తిరిగి రేసింగ్‌లో పాల్గొని అప్పట్లో సంచలం సృష్టించారు.





Untitled Document
Advertisements