అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు రిలయన్స్‌రిటైల్‌ బెడద

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 05:02 PM

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు రిలయన్స్‌రిటైల్‌ బెడద

ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌రిటైల్‌ సంస్థ త్వరలో అమెజాన్‌, వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్‌గా మారనుంది. ప్రపంచ మార్కెట్‌ పరిశోధన సంస్థ ఫోర్రెస్టర్‌ ప్రకారం 2023 నాటికి భారతదేశంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ విక్రయాల మార్కెట్‌ విలువ 85 బిలియన్‌ డాలర్లకుచేరనుంది. వచ్చే అయిదేళ్లలో ఆన్‌లైన్‌ రిటైల్‌ అమ్మకాలు 25.8శాతం వృద్ధిని సాధించనున్నాయి. దీంతో భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చే రిలయన్స్‌ స్టోర్లకు ఆదరణ పెరుగుతుందని ఫారెస్టర్‌ అంచనా వేస్తోంది. అలాగే భారీ ఆఫర్లతో రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌లో అడుగుపెడితే, ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలకు నష్టాలు తప్పవని, దాదాపు టెలికాం మార్కెటోకి జియో ప్రవేశించిన తర్వాత ఏర్పడిన పరిస్థితులే పునరావృతం అవుతాయని ఫారెస్టర్‌ సీనియర్‌ ఫోర్‌కాస్ట్‌ అనలిస్ట్‌ సతీష్‌ మీనా అభిప్రాయపడ్డారు. కాగా 2019 ఏప్రిల్‌లో రిలయన్స్‌ తన ఎంప్లాయీస్‌ కోసం ఫుడ్‌ అండ్‌ గ్రోసరీ యాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఈ ఏడాదిలోనే యాప్‌ను కమర్షియల్‌గా లాంచ్‌చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తద్వారా రిలయన్స్‌ గ్రూప్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ టూ ఆఫ్‌ లైన్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాంను అందుబాటులో తేవడంతోపాటు, వినియోగదారులకు భారీ ప్రయోజనాలను అందించనుంది.





Untitled Document
Advertisements