బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు ట్రోఫీని సొంతం చేసుకుంటాయ...?

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:01 PM

బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు ట్రోఫీని సొంతం చేసుకుంటాయ...?

వరల్డ్ కప్ టోర్నీలో ఏమాత్రం భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్న జట్లు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు. 10 జట్ల మధ్య జరిగే ఈ హోరాహోరీ పోటీలో ఈ జట్లు ట్రోఫీని ఎత్తడం కాస్త కష్టమైన పనే. కాని 1983లో భారత్, 1987లో ఆస్ట్రేలియాలు కూడా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 1983 ప్రపంచకప్‌లో భారత్ కనీసం ఒక్క విజయం సాధించినా అద్భుతమేనని అప్పట్టో అందరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో పసికూనగా బరిలోకి భారత్ పెద్ద పెద్ద జట్లను చిత్తుచిత్తుగా ఓడిస్తూ ఏకంగా ట్రోఫీని ఎగురేసుకు పోయింది. ఆ ప్రపంచకప్‌తో భారత్ దశనే మారిపోయింది. ఆస్ట్రేలియా కూడా 1987లో ఇలాంటి విజయాన్నే అందుకుంది. ఉపఖండంలో జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, తాజాగా ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు ఇలాంటి గెలుపుపై కన్నేశాయి. అయితే ఈ జట్ల ఆశ నెరవేరడం క్లిష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదని చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇటు బంగ్లాదేశ్, అటు అఫ్గాన్‌లు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంచలన జట్లుగా పేరు తెచ్చుకున్నాయి.





Untitled Document
Advertisements