అప్పటి నుండి నా ఫోటోల కోసం వెతకడం మానేశా!!

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:50 PM

అప్పటి నుండి నా ఫోటోల కోసం వెతకడం మానేశా!!

అతిథి రావు హైదరి.. హైదరాబాద్ అమ్మాయి. ఐతే, ముందుగా బాలీవుడ్ లో మెరిసింది. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ కి పరిచయం అయింది. చెలి, సమ్మోహనం, అంతరిక్షం సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకొంది. ఈ మధ్య అతిథి గత అనుభవాలని నెమరువేసుకొంటోంది. హీరోయిన్ గా వచ్చిన కొత్తలో వీపుభాగం మొత్తం కనిపించేలా ఫోటో షూట్ చేశారు. ఆ తర్వాత గూగుల్ వాటిని చూస్తే.. నాకే ఓ రకంగా అనిపించిందని అప్పటి నుంచి తన ఫోటోల గురించి వెతకడం మానేశానని చెప్పుకొచ్చింది.

తాజాగా తన తొలి ప్రేమలేఖ గురించి తెలిపింది అతిథి. 5వ తరగతి చదువుతున్నప్పుడే తన సీనియర్ ప్రేమలేఖ రాశాడని చెప్పుకొచ్చింది. అప్పుడు తన వయసు 9 ఏళ్లని పేర్కొంది. ఐతే, తనకి ఇప్పటికీ డేటింగ్ ఎలా చేయాలో తెలియదని చెప్పింది. 9 యేళ్ల వయసులోనే ప్రేమలేఖలు.. అందుకొన్న అతిథికి డేటింగ్ అంటే ఏంటో తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.. !





Untitled Document
Advertisements