కోహ్లీ స్మిత్‌లు ఫేవరెట్‌!

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:13 PM

కోహ్లీ స్మిత్‌లు ఫేవరెట్‌!

ఈ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌లు అని ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అన్నారు. ఈ సందర్భంగా బట్లర్ మాట్లాడుతూ...కోహ్లీ, స్మిత్‌లు ఇద్దరూ మంచి బ్యాట్స్‌మెన్‌లు. ఐపీఎల్-12లో స్మిత్‌ను దగ్గర నుండి చూసాను. అతన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని నుంచి చాలా నేర్చుకున్నాను. కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనో అద్భుతమైన బ్యాట్స్‌మన్‌. 12 నెలల పాటు అతను ఫామ్‌లోనే ఉంటాడు. ఇద్దరి బ్యాటింగ్‌ స్టైల్ వేర్వేరుగా ఉంటుంది. వారి ఆటంటే నాకు ఇష్టం. ఈసారి ప్రపంచకప్‌లో వారే ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌లు' అని బట్లర్‌ పేర్కొన్నారు.'బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్‌ను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ.. జట్టు సబ్యులకు ఆదర్శంగా నిలిచాడు. ప్రపంచంలోనే బెన్ మంచి ఆల్‌రౌండర్‌. అతడు కచ్చితంగా ప్రపంచకప్‌లో సత్తా చాటుతాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున నా ఆటతీరు బాగుంది. ఐపీఎల్‌ ఫామ్‌ ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుంది. ఈసారి ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. ప్రపంచకప్‌ జట్టులో ఉండడం సంతోషంగా ఉంది' అని బట్లర్‌ తెలిపారు.ఈ నెల 30న జరిగే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తలపడుతుంది. అంతకంటే ముందు 25న ఆసీస్‌తో, 27న అఫ్గానిస్తాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో విశ్వవిజేతగా నిలవాలని ఇంగ్లండ్‌ పట్టుదలతో ఉంది.





Untitled Document
Advertisements