బుమ్రా బౌలింగ్‌ను అర్థం చేసుకోవడం కష్టం: రోహిత్

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 05:57 PM

బుమ్రా బౌలింగ్‌ను అర్థం చేసుకోవడం కష్టం: రోహిత్

భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా ఓ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ....'ఎదుగుతున్న పిల్లలు ఏదో సమయంలో స్ఫూర్తి చెంది తమకు ఇష్టమైన రంగాల్లోకి వెళుతుంటారు. ఒక క్రికెట్ క్రీడాకారుకి ప్రపంచకప్‌ ఆడాలని, కప్ సాధించాలని ఉంటుంది. నాకు కూడా కప్ సాధించాలనే కల ఉంది. మ్యాచ్‌లో ఎప్పుడూ ఒత్తిడిని దరిచేయనీయకూడదు. ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే అత్యుత్తమ ఆట ఆడదానికి దోహదం చేస్తుంది. విజయం సాధించాలంటే (కప్‌) నిరాశ కాదు సహనం ఉండాలని' అని రోహిత్ పేర్కొన్నారు.'తన ముంబై జట్టు ఆటగాళ్లు బుమ్రా, పాండ్యాలు సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు కూడా ప్రతి మ్యాచ్‌లో రాదేలుతున్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ ముందుంటారు. గత కొన్ని నెలలుగా అద్భుత ఆట ప్రదర్శిస్తున్నారు. పాండ్యా ఐపీఎల్-12లో కొన్ని మంచి ప్రదర్శనలు చేసాడు. టోర్నీలో తన వంతు కృషి చేస్తాడు' అని రోహిత్ అన్నారు.'బుమ్రా బౌలింగ్‌ను నెట్స్‌లో కూడా ఆడడం ఇబ్బందే. అతని బౌలింగ్‌ని అర్ధం చేసుకోవడం కూడా కష్టమే. అతను ఓ స్పెషల్. టాప్ ఆర్డర్ లో పరుగులు చేయడం నాకు, ధావన్, కోహ్లీకి ఓ బాధ్యత. ఇదే మా పని. ఈ రోజు నేను ఆడాను.. ఈ రోజు నువ్వు ఆడు అని అనుకోలేం. మా భాద్యతను నిర్వర్తించడమే మాకు తెలుసు. ఈ టోర్నీలో అందరం రాణించాల్సిన అవసరం ఉంది' అని రోహిత్ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements