వివో వీ15 ధర తగ్గింపు

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 07:04 PM

 వివో వీ15 ధర తగ్గింపు

చైనా కంపనీ వివో తన నూతన పాపప్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ వివో వీ15 ధర తగ్గించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వివో కంపెనీ మార్చి నెలలో వివో 15 స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,990 ధరతో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ ఈ ఫోన్ ధరను గత నెలలో రూ.21,990కు తగ్గించింది. అంటే ఫోన్ ధర రూ.2,000 దిగొచ్చింది. కంపెనీ తాజాగా మరోసారి వివో వీ15 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది. ధరలో రూ.2,000 కోత విధించింది. దీంతో ఫోన్ ధర రూ.19,990కు దిగొచ్చింది. ఫోన్ ధర మొత్తంగా రూ.4,000 తగ్గింది. దేశంలో పాపప్ కెమెరా ఫీచర్‌తో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇదే. వివో వీ15 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల స్క్రీన్, ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా (12 ఎంపీ+8 ఎంపీ+5 ఎంపీ), 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా, 64 జీబీ మెమరీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.





Untitled Document
Advertisements