డేరా బాబాకి కఠిన శిక్ష విధించాలంటున్న నిర్భయ తల్లి

     Written by : smtv Desk | Tue, Aug 29, 2017, 11:54 AM

డేరా బాబాకి కఠిన శిక్ష విధించాలంటున్న నిర్భయ తల్లి

న్యూఢిల్లీ, ఆగస్టు 29 : దేశంలో ఎవరినోటా చూసిన...గుర్మీత్ రాం రహీం సింగ్ బాబా గురించిన మాటలే వినిపిస్తున్నాయి. ఈ మేరకు నిర్భయ తల్లి ఆశాదేవి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా రాం రహీంకు శిక్ష విధించినందుకు ఆమె ఆనందం వ్యక్త పరిచారు. అయితే ఈ ఒక్క శిక్ష అతనికి సరిపోదని ఆమె స్పష్టం చేశారు. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా కఠినమైన శిక్ష కూడా విధించాల్సి ఉండాలని ఆమె అభిప్రాయాన్ని తెలిపారు. ఈ 15 ఏళ్లలో గుర్మీత్ రామ్ రహీం అకృత్యానికి బలైపోయిన బాధిత మహిళలు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారో, ఎన్ని అవమానాలు పడి ఉంటారో, ఎన్ని వేధింపులకు గురై ఉంటారోరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు అనుభవించిన క్షోభతో పోలిస్తే గుర్మీత్ రాం రహీంకు ఈ శిక్ష సరిపోదని ఆమె అన్నారు. అయితే అతనికి ఈ శిక్ష పడేలా చేసిన వారందరికీ సలాం చేయాలని ఆమె తెలిపారు.

Untitled Document
Advertisements