జయసూర్య నిజంగా చనిపోయాడా...అశ్విన్ ట్వీట్

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 04:29 PM

జయసూర్య నిజంగా చనిపోయాడా...అశ్విన్ ట్వీట్

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ అప్పట్లో అనేక వార్తలొచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఈ రూమర్స్‌పై స్వయంగా స్పందించిన జయసూర్య.. తాను శ్రీలంకలో క్షేమంగా ఉన్నానని.. ఈ మధ్యకాలంలో కెనడాకి వెళ్లలేదంటూ ఆ వార్తల్ని కొట్టిపారేశాడు. కానీ.. మళ్లీ భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో జయసూర్య వార్త నిజమేనా..? అంటూ తెరపైకి తెచ్చాడు. దీంతో.. అభిమానులు అది తప్పుడు వార్త అంటూ సమాధానాలిస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. యువ స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌పై నమ్మకం ఉంచిన సెలక్టర్లు.. అశ్విన్‌కి జట్టులో చోటివ్వలేదు. దీంతో.. వరల్డ్‌కప్ ఆడే అవకాశాన్ని అశ్విన్ కోల్పోయాడు.

Untitled Document
Advertisements