నారాయణ స్కూల్ సీజ్....కారణమిదే!!

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:26 PM

నారాయణ స్కూల్ సీజ్....కారణమిదే!!

విజయవాడలోని సత్యనారాయణపురంలో సరైన అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు ఈ ఉదయం సీజ్ చేశారు. గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ స్కూల్ ను సీజ్ చేశారు. గతంలో పాఠశాల యాజమాన్యానికి మూడు దఫాలు నోటీసులు ఇచ్చామని, అయినా, వారి వైఖరి మారకపోవడంతో సీజ్‌ చేయడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించామని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఉదయం వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements