క్రెడిట్ హిస్టరీ లేనివారికి అమెజాన్ క్రెడిట్ కార్డులు

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:27 PM

క్రెడిట్ హిస్టరీ లేనివారికి అమెజాన్ క్రెడిట్ కార్డులు

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య పెరుగుతూ పోతోంది. పేటీఎం, ఓలా కంపెనీలు కూడా ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులను లాంచ్ చేశాయి. ఇప్పుడు వీటి జాబితాలోకి అమెజాన్ కూడా వచ్చి చేరింది. అమెజాన్ కూడా క్రెడిట్ కార్డులను ఆవిష్కరించింది. సీఎన్‌‌బీసీ నివేదిక ప్రకారం.. జెఫ్ బెజోస్ సారథ్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా క్రెడిట్ కార్డులను లాంచ్ చేసింది. దీనికోసం సింక్రోనీ ఫైనాన్షియల్ అనే బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెరికా పౌరులకు ఇవి తొలిగా అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రధానంగా క్రెడిట్ హిస్టరీ కలిగిలేనివారు లక్ష్యంగా ఈ క్రెడిట్ కార్డులను ఆవిష్కరింది. దీని పేరు అమెజాన్ క్రెడిట్ బిల్డర్ కార్డు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్న వారికి, రెగ్యులర్ క్రెడిట్ కార్డు పొందలేని వారికి కూడా అమెజాన్ కార్డులను జారీ చేయవచ్చు. దీంతో క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకోవచ్చు.





Untitled Document
Advertisements