'మన్మథుడు 2' టీజర్ వచ్చేస్తుంది!!

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:57 PM

'మన్మథుడు 2' టీజర్ వచ్చేస్తుంది!!

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక, సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలకి ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 13న టీజర్ ని వదలనున్నారు.

అదే రోజు ‘సాహో’ టీజర్ కూడా రానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. సుజీత్ దర్శకుడు. షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకొంది. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్వీడుని పెంచనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13న టీజర్ ని వదలనున్నారు. ప్రభాస్, నాగ్ టీజర్ లతో మాత్రమే పోటీ పడతారా ? లేదంటే ?? సినిమాలు ఒకే రోజు విడుదల చేస్తారా ?? అన్నది తెలియాల్సి ఉంది. సాహో ఆగస్టు 15కి ఫీక్సయింది. మన్మథుడు 2 రిలీజ్ ఇంకా ఖరారు కాలేదు.

Untitled Document
Advertisements