టాప్-100లో విరాట్ ఒక్కడే!

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:23 PM

టాప్-100లో విరాట్ ఒక్కడే!

ఫోర్బ్స్ తాజాగా ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం సంపాదిస్తోన్న క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియా తరపునుంచి టాప్-100లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అది కూడా చివరి స్థానం. ఇదే జాబితాలో గతేడాది 83వ స్థానంలో ఉన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ ఏడాది 100వ స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం. 2018-19 సంవత్సరానికి గాను విరాట్‌ కోహ్లీ 21 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.173 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాడు.ఇందులో క్రికెట్‌ మ్యాచ్‌ల ద్వారా వచ్చింది రూ.27 కోట్లు కాగా మిగతా రూ.146 కోట్లు వాణిజ్య ఒప్పందాల కారణంగా కోహ్లీ ఆర్జించాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సి 127 మిలియన్‌ డాలర్లలో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో 109 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచాడు.

Untitled Document
Advertisements