ఒలింపిక్స్‌లో పాల్గొనే దిశగా భారత జట్లు కసరత్తు

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:24 PM

ఒలింపిక్స్‌లో పాల్గొనే దిశగా భారత జట్లు కసరత్తు

నెదర్లాండ్స్‌: త్వరలో రానున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే దిశగా భారత పురుషుల, మహిళల రికర్వ్‌ విభాగం జట్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌ షిప్‌ టీమ్‌ విభాగంలో భారత జట్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కెనడాతో భారత పురుషుల జట్టు... బెలారస్‌తో భారత మహిళల జట్టు తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌లను ఖాయం చేసుకుంటాయి. మంగళవారం జరిగిన పురుషుల టీమ్‌ విభాగం తొలి రౌండ్‌లో తరుణ్‌దీప్‌ రాయ్, అతాను దాస్, ప్రవీణ్‌ రమేశ్‌ జాదవ్‌లతో కూడిన భారత బృందం 5-1 సెట్‌ పాయింట్లతో సాండెర్, నెస్టింగ్, హాగెన్‌లతో కూడిన నార్వే జట్టును ఓడించింది.

Untitled Document
Advertisements