ఒమన్‌గల్ప్‌లో రెండు ఆయిల్ ట్యాంకర్లు దాడికి గురి

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 12:53 PM

ఒమన్‌గల్ప్‌లో రెండు ఆయిల్ ట్యాంకర్లు దాడికి గురి

దుబాయి: ఒమన్‌గల్ప్‌లో గురువారం రెండు ఆయిల్ ట్యాంకర్లు దాడులకు గురయ్యాయి. దీంతో ఆ ట్యాంకర్ల నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది నీళ్లలో దూకి ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. దక్షిణ ఇరాన్‌లోని బందర్ ఇ జాస్క్‌కు 25 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన చోటు చేసుకుంది. ఖతార్ నుంచి తైవాన్‌కు ఇథనాల్‌ను తరలిస్తుండగా ఉదయం 8.50 గంటలకు మొదటి నౌక ప్రమాదానికి గురవగా 23 మంది సిబ్బంది, గంట తర్వాత సౌదీ అరేబియా నుంచి సింగపూర్‌కు మెథనాల్‌ను తరలిస్తున్న మరో నౌకకు నిప్పంటుకోవండంతో 21 మంది సిబ్బంది నీళ్లలో దూకినట్లు ఇరాన్ పత్రిక ఇర్నా తెలిపింది. వ్యూహాత్మక సముద్ర మార్గంలో కొద్ది వారాల్లో జరిగిన రెండో ఘటన కావడం గమనార్హం.





Untitled Document
Advertisements