కోన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ....ఒక్కసారి చార్జింగ్ పెడితే 400 కిలోమీటర్ల ప్రయాణం

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 01:34 PM

కోన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ....ఒక్కసారి చార్జింగ్ పెడితే 400 కిలోమీటర్ల ప్రయాణం

దేశంలో వాహనాల కొనుగోలు దారులు తగ్గిపోవడంతో దేశీయ కంపనీలు కనీస వాటాలను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు హ్యుందాయ్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. దీని పేరు కోన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. వచ్చే నెలలో ఇది మార్కెట్‌లోకి రానుంది. దేశీ మొట్టమొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే. కంపెనీ కొత్త సీఈవోగా నియమితులైన సెయాన్ సాయిబ్ కిమ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుపై చాలా ఆశావహంగా ఉన్నారు. ఈ కారు ఒక్కసారి చార్జింగ్ పెడితే 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణిస్తుందని తెలిపారు. భారత్‌లో ఈ కారు సంచలనం క్రియేట్ చేస్తుందని అంచనా వేశారు. భారత్‌లో ఇప్పటిదాకా రిలీజ్ అయిన కార్లు ఒక్కసారి చార్జింగ్ పెడితే గరిష్టంగా 150 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలవు. హ్యుందాయ్ కోన ఎస్‌యూవీలో 134 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. కంపెనీ ఇందులో 39.2 కిలోవాట్ బ్యాటరీ అమర్చింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణిస్తుంది. 10 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారు టాప్ స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లు. దీని ధర రూ.20-రూ.25 లక్షల శ్రేణిలో ఉండొచ్చు.





Untitled Document
Advertisements