కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు గూగుల్ మద్దతు

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 02:36 PM

కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు గూగుల్ మద్దతు

న్యూఢిల్లీ: భారత కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సహకరిస్తుందని ఆ సంస్థ సిఇఒ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. యుఎస్ -ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్‌ఐబిసి) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సు అనంతరం పిచాయ్‌కు , నాస్‌డాక్ అధ్యక్షడు అదెనా ఫ్రెడ్‌మాన్‌కు గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పిచాయ్ మాట్లాడుతూ, అమెరికా-భారత్‌లు కలిసి వ్యక్తిగత గోప్యతకు కావాల్సిన సురక్షిత ప్రమాణాలను తీసుకురాగలవని అన్నారు.చాలా రోజుల నుంచి గూగుల్ భారత్‌లో ఉండటంతో ఒక విషయం గమనించానని, భారతీయ ఉత్పత్తిదారులు చాలా పరికరాలను దేశీయంగానే రూపొందిస్తున్నారని అన్నారు. భారత ప్రభుత్వం కూడా దేశీయంగా సాంకేతిక అభివృద్ధి పర్చడానికి అవసరమైన చర్యలు చేపట్టిందని, సరైన పాలన, ఆర్థిక, సామాజిక అంశాలను మెరుగుపర్చడం వంటివి చేసిందని అన్నారు. భారత్ డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గినప్పుడు తామూ ఇక్కడి మార్కెట్లోకి రావాలనుకొన్నామని అన్నారుప. అందుకోసం పూర్తిస్థాయిలో కృషి చేశామని, ఇప్పుడు తమ డిజిటల్ చెల్లింపుల ప్రొడక్ట్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళుతున్నామని అన్నారు. భారత్‌ను నిర్మిస్తే ప్రపంచానికి సేవ చేయవచ్చని తెలిపారు.





Untitled Document
Advertisements