21ఏళ్ళకే 196 దేశాలను చుట్టుముట్టిన లెక్సి

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 03:05 PM

21ఏళ్ళకే 196 దేశాలను చుట్టుముట్టిన లెక్సి

అమెరికాకు చెందిన 21ఏళ్ళ లెక్సి ఆల్ఫ్రెడ్‌ అనే అమ్మాయి గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. అతి చిన్న వయసులో 196 దేశాల్లో పర్యటించిన అమ్మాయిగా తానూ ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డు ఇదివరకు 24 ఏళ్ల ఓ మహిళా మీద ఉంది. అయితే ఇప్పుడు ఆ రికార్డును లెక్సి తిరగరాసింది. గత ఆరు నెలలుగా అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ ఎంతో ఆత్రుతగా ఈరోజు కోసం ఎదురుచూశానని ఆమె ఈ సందర్భంగా మీడియాకు తెలిపింది. తన ప్రయాణానికి కావాల్సిన డబ్బును తానే సంపాదించుకున్నానని తెలిపింది. కనిపించిన ప్రతి పనిచేశానని, 12 ఏళ్ల వయసు నుంచే దాచుకోవడం మొదలు పెట్టా అని తన కలను నెరవేర్చుకోడానికి చేసిన ప్రయత్నాలను వివరించింది. డబ్బు సంపాదన కోసం అనేక బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నానని.. అవసరమైన ఒప్పందాలేంటో తెలుసుకోవడానికి ముందుగా చాలా పరిశోధన చేశానని, తక్కువ ధరలో లభ్యమయ్యే వసతి మాత్రమే ఉపయోగించానని ఆమె వెల్లడించింది. ఈ ప్రపంచ పర్యటనకు కావాల్సిన డబ్బు సంపాదించడం కోసం లెక్సి తన కుటుంబానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీలోనే పనిచేసింది. ఆ ట్రావెల్ ఏజెన్సీనే ప్రయాణాల మీద ఆమెకు ఆసక్తి కలగడానికి కారణమైందని ఆమె చెప్పుకొచ్చింది. మా తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం స్కూల్‌కు దూరంగా కొన్ని రోజుల పాటు నన్ను వేరే ప్రాంతంలో ఉంచి, స్వతంత్రంగా జీవించేలా ప్రోత్సహించారని ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గురించి వివరించింది. తన పర్యటనలో భాగంగా ప్రతి ప్రదేశంలో రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ కాలం గడపలేదని తెలిపింది. ప్రస్తుతం 196 దేశాల పర్యటనకు సంబంధించి 10,000 ఆధారాలను గిన్నిస్‌ బుక్‌కు సమర్పించే పనిలో ఆమె నిమగ్నమైంది.





Untitled Document
Advertisements