మల్టీస్టారర్ కు రెడీ అవుతున్న 'మజిలీ' జోడి

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 03:31 PM

మల్టీస్టారర్ కు రెడీ అవుతున్న 'మజిలీ' జోడి

పెళ్లి తర్వాత సమంత-నాగ చైతన్య తొలిసారి కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత మరోసారి సామ్-చై కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. ఆ ఆశలు త్వరగానే తీరబోతున్నట్టు తెలుస్తోంది. వెంకీ-నాగ చైతన్యల మల్టీస్టారర్ లో సామ్ ఓ కీలక పాత్రలో నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. అక్కడ సామ్ సడెన్ ప్రత్యక్షమైంది. అది కూడా తన పర్సనల్ మేకప్ మెన్, డిజైనర్ తో సహా అక్కడ వాలిపోయింది. ఈ నేపథ్యంలో వెంకీ మామలో సామ్ కూడా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది.





Untitled Document
Advertisements