వివో స్మార్ట్‌ఫోన్లపై మరోసారి ధర తగ్గింపు

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 05:04 PM

వివో స్మార్ట్‌ఫోన్లపై మరోసారి ధర తగ్గింపు

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వివో తన వివో వై93 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది. కంపెనీ వివో వై93 ధరను రూ.1,000 తగ్గించింది. తగ్గింపు ధర కంపెనీ వెబ్‌సైట్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో ఉంది. ఫోన్ ధర గతంలో కూడా రూ.1,000 తగ్గిన విషయం తెలిసిందే. వివో వై93 3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.10,990గా ఉంది. దీని ధర ఇదివరకు రూ.11,990. ఇక 4 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.11,990. ఇదివరకు దీని ధర రూ.12,990. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.2 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ రియర్ కెమెరా (13 ఎంపీ+2 ఎంపీ), 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి.





Untitled Document
Advertisements