గేల్ రికార్డ్...

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 05:36 PM

గేల్ రికార్డ్...

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్-విండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కగేల్ ఇప్పటివరకు వన్డేల్లో ఇంగ్లాండ్ పై 1632 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరా(1625) రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకూ వన్డేల్లో అత్యధిక పరుగుల సాధించిన రికార్డు కుమార సంగక్కరా పేరిట ఉండగా, దాన్ని గేల్‌ బ్రేక్‌ చేశాడు. అయితే వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు సాధించడానిక గేల్‌కు పట్టిన ఇన్నింగ్స్‌లు 34 కాగా, సంగక్కరాకు 41 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో గేల్‌, సంగక్కరాల తర్వాత స్థానంలో వివ్‌ రిచర్డ్స్‌(1619), రికీ పాంటింగ్‌(1598), మహేలా జయవర్థనే(1562)లు ఉన్నారు.





Untitled Document
Advertisements