పెంపుడు కుక్కతో పశువులా ప్రవర్తించిన యజమాని

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:44 AM

పెంపుడు కుక్కతో పశువులా ప్రవర్తించిన యజమాని

లండన్: ఇంగ్లాండ్‌లో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో అతి కిరాతకంగా ప్రవర్తించాడు. నోరులేని మూగజీవి అని కూడా చూడకుండా ఎయిర్ గన్నుతో దానిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని హ్యాంప్ షేర్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం....హ్యాంప్ షేర్‌కు చెందిన సీమన్ హ్యంకాక్ ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు ఉన్మాదిలా మారి ఎయిర్ గన్నుతో కుక్క తలపై కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా దాన్ని తీసుకెళ్లి పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.

అది గమనించిన ఓ వ్యక్తి వెంటనే జంతు సంరక్షణ సిబ్బందికి సమాచారం అందించాడు.హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది. కుక్కను ఆస్పత్రికి తరలించారు. వైద్యలు చికిత్స నిర్వహించి, తలలో దిగిన పెల్లెట్లను బయటకు తీసి రక్షించారు. కుక్కను చంపేందుకు ప్రయత్నించిన హ్యాంప్ షేర్‌పై జంతుసంరక్షణా సిబ్బంది కేసు పెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హ్యాంకాక్‌ను కోర్టు‌లో హాజరు పర్చగా, అతనికి 10 ఏళ్లు జంతువులను పెంచుకునేందుకు అనుమతి రద్దు చేసింది.





Untitled Document
Advertisements