క‌రీనా పెళ్లికి వెళ్ల‌లేదు, దీపికా 'ది బెస్ట్' : షాహిద్‌ క‌పూర్

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 01:49 PM

క‌రీనా పెళ్లికి వెళ్ల‌లేదు, దీపికా 'ది బెస్ట్' : షాహిద్‌ క‌పూర్

తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్ 'క‌బీర్ సింగ్‌' లో హీరోగా న‌టించాడు బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్‌. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న ఈ సినిమా క‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని షాహిద్ చాలా న‌మ్మ‌కంతో ఉన్నాడు. ప్ర‌స్తుతం సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు. నేహా ధూపియా నిర్వ‌హిస్తున్న ఓ టాక్ షోకు తాజాగా హాజ‌రైన షాహిద్ త‌న మాజీ ప్రేయ‌సి క‌రీనా క‌పూర్ గురించి మాట్లాడాడు.

"మీరు ప్రియాంక పెళ్లికి వెళ్లారు, మరి క‌రీనా పెళ్లికి ఎందుకు వెళ్ల‌లేద‌"ని షాహిద్‌ను నేహ ప్ర‌శ్నించింది. "నేను క‌రీనా పెళ్లికి వెళ్ల‌లేదు. ఆమె పెళ్లి జ‌రిగి చాలా రోజులవుతోంది. ఆమె న‌న్ను పెళ్లికి పిలిచిన‌ట్టు లేదు" అని చెప్పాడు. అలాగే 'ప‌ద్మావ‌త్‌' సినిమా షూటింగ్ సంద‌ర్భంగా హీరోయిన్ దీపికా ప‌దుకొనేతో బాగా క‌నెక్ట్ అయ్యాన‌ని, షూటింగ్ సంద‌ర్భంగా చాలా విష‌యాలు మాట్లాడుకున్నామ‌ని షాహిద్ చెప్పాడు. ఇప్ప‌టివ‌ర‌కు నటించిన అంద‌రిలోకీ దీపికానే త‌న‌కు బెస్ట్ కో-స్టార్ అని తెలిపాడు.





Untitled Document
Advertisements