పాఠ్య పుస్తకాల్లో రజనీకాంత్‌ జీవిత అంశాలు....వీపరీతమైన వ్యతిరేకత

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 03:42 PM

పాఠ్య పుస్తకాల్లో రజనీకాంత్‌ జీవిత అంశాలు....వీపరీతమైన వ్యతిరేకత

సూపర్‌స్టార్ ర‌జినీకాంత్ జీవితానికి సంబంధించిన అంశాల‌ను త‌మిళ పాఠ్యపుస్త‌కాల్లో చేర్చ‌డంపై సినీ ద‌ర్శకుడు, నామ్‌ తమిళర్‌ పార్టీ అధినేత సీమాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐదో తరగతి పుస్తకంలో రజనీకాంత్‌కు సంబంధించిన అంశాలను ప్ర‌భ‌త్వం తాజాగా చేర్చింది. దీనిపై శనివారం ఉదయం నామ్‌ తమిళర్‌ పార్టీ తరపున సీమాన్ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.

సినీస్టార్ల గురించి పాఠాలు బోధించ‌డం మంచిది కాద‌న్నారు. నిజానికి ర‌జినీకాంత్ కంటే క‌మ‌ల్ హాస‌న్ ఎంతో ఉత్త‌మ న‌టుడ‌ని, క‌మ‌ల్ హాస‌నే ఎంతో సాధించార‌ని పేర్కొన్నారు. రజినీ కంటే ముందే ఎంతో మంది క‌ళాకారులు క‌ష్ట‌ప‌డి ఉన్న‌త స్థాయికి ఎదిగార‌ని చెప్పారు. అలాంటిది రజనీకాంత్‌ను మాత్ర‌మే పాఠ్య పుస్తకాల్లో కీర్తించడం సరైన చ‌ర్య కాద‌న్నారు.





Untitled Document
Advertisements