ఇద్దరని చెప్పి తొమ్మిది మంది గ్యాంగ్ రేప్.....సెక్స్ వర్కర్ల ఫిర్యాదు!

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 11:58 AM

ఇద్దరని చెప్పి తొమ్మిది మంది గ్యాంగ్ రేప్.....సెక్స్ వర్కర్ల ఫిర్యాదు!

దేశ రాజధాని న్యూఢిల్లీలో పొట్టకూటి కోసం పడుపు వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ముగ్గురిపై దారుణంగా ప్రవర్తించారు కొందరు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడి లజ్‌ పత్‌ నగర్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ విటుడి కోసం సెక్స్ వర్కర్లు వేచి చూస్తున్న వేళ, స్విప్ట్‌ డిజైర్‌ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమకు వేశ్యలు కావాలని, ఒక రాత్రి గడిపితే రూ. 3 వేల చొప్పున ఇస్తామని, తాము ఇద్దరం ఉన్నామని చెప్పారు. అందుకు వేశ్యలు అంగీకరించగా, అడ్వాన్స్ కింద, రూ. 3600 ఇచ్చారు. ఆపై శివార్లలోని నొయిడా సెక్టార్‌ 135లో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లారు.

అప్పటికే అక్కడ ఏడుగురు ఉండటంతో తమ పరిస్థితిని ఊహించుకున్న సెక్స్ వర్కర్లు, తాము తిరిగి వెళ్లిపోతామని చెప్పారు. వారిని వెళ్లనివ్వకుండా, బెదిరించి, వారిని కొట్టి, బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులను లాక్కున్నారు. వారిలోని ఓ వ్యక్తి సాయంతో రోడ్డుపైకి వచ్చిన ముగ్గురూ, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించామని, ఏడుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితులంతా ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ అని, ఒకరు మాత్రం క్యాబ్‌ డ్రైవర్‌ గా పని చేస్తున్నాడని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని అన్నారు.

Untitled Document
Advertisements