ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు!!

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 12:16 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే నెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఈ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. వచ్చే నెల 12న అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెడతారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఏపీ అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, పలు కీలక ప్రాజెక్టుల్లో పురోగతి సహా పలు అంశాలపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ సాగనుంది.

Untitled Document
Advertisements