మోదీ వల్ల ఖాదీకి పెరుగుతున్న క్రేజ్ - పబ్లిసిటీ ఇన్ ఎవ్రీ సిటీ

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 01:06 PM

మొత్తం టెక్స్‌‌టైల్ మిల్ ఉత్పత్తిలో ఖాదీ ఫ్యాబ్రిక్ షేరు ఈ ఐదేళ్లలో రెండింతలు పెరిగి 8.49 శాతంగా ఉన్నట్టు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ మంగళవారం చెప్పింది. 2014–15లో 2,486 మిలియన్ చదరపు మీటర్ల మిల్ ఫ్యాబ్రిక్ ఉత్పత్తి చేపట్టగా.. 105.38 మిలియన్ చదరపు మీటర్ల ఖాదీ ఉత్పత్తి జరిగింది. అప్పట్లో మొత్తం టెక్స్‌‌టైల్ ఉత్పత్తిలో ఖాదీ ఫ్యాబ్రిక్ షేరు 4.23 శాతంగా ఉంది. అయితే 2018–19లో మిల్‌‌ ఫ్యాబ్రిక్ ఉత్పత్తి 2,012 మిలియన్ చదరపు మీటర్లకు తగ్గింది. ఖాదీ ఫ్యాబ్రిక్ ఉత్పత్తి అయితే 170.80 మిలియన్ చదరపు మీటర్లు పెరిగింది. అంటే ఇది మొత్తం ఉత్పత్తిలో 8.49 శాతానికి చేరింది. 2014–15తో పోలిస్తే కూడా రెండింతలు అధికం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖాదీ దుస్తుల కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమంతో ఖాదీ ఫ్యాబ్రిక్ ఉత్పత్తి 4.23 శాతం నుంచి 8.49 శాతం పెరిగిందని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ఛైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. 1956 నుంచి 2013–14 వరకు ఖాదీ సెక్టార్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ 105.38 మిలియన్ చదరపు మీటర్లకు చేరగా.. గత ఐదేళ్లలో మరో 65.42 మిలియన్ చదరపు మీటర్ల ఫ్యాబ్రిక్ ఉత్పత్తి జరిగిందని చెప్పారు. ఎంఎస్‌‌ఎంఈ మంత్రిత్వ శాఖ, కేవైఐసీ చేపట్టిన కార్యక్రమాలు, విధానాలతో ఖాదీ సెక్టార్‌‌‌‌లో కళాకారులు కూడా పెరిగారని తెలిపారు.





Untitled Document
Advertisements