గాయంతో పోరాడిన ఆలెక్స్ క్యారీ!

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 05:47 PM

గాయంతో పోరాడిన ఆలెక్స్ క్యారీ!

బర్మింగ్‌హామ్: బర్మింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆలెక్స్ క్యారీ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దీంతో అతనికి తీవ్ర గాయమై.. రక్తం కూడా కారింది. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా మెడికల్ సిబ్బంది మైదానంలోకి వచ్చి.. అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే రిటైర్డ్ హర్ట్‌గా క్యారీ మైదానం నుంచి తప్పుకోకుండా.. బ్యాండ్ ఏయిడ్ ధరించి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 14 పరుగుల వద్దే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది.





Untitled Document
Advertisements