'ఇస్మార్ట్ శంకర్' మూవీ చుసిన రామ్ ఏమన్నారంటే

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 08:47 PM

హీరో రామ్ చేసిన కొత్త సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంపై మొదటి నుండి రామ్ చాలా క్రేజీగా ఉన్నారు. సినిమాలో తన పాత్ర ప్రేక్షకుల్ని గొప్పగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ట్రైలర్లో ఆయన పాత్రను మలిచిన తీరు, డైలాగ్స్ చూస్తే హీరో క్యారెక్టర్ భిన్నంగానే ఉంటుందనిపిస్తోంది.

తాజాగా సినిమాను వీక్షించిన రామ్ పాత్రలో నటించేటప్పుడు ఎలాంటి కిక్ అయితే వచ్చిందో సినిమా చూస్తున్నప్పుడు కూడా అలాంటి కిక్కే వచ్చింది అన్నారు. అలాగే సినిమా తీసిన పూరికి థాంక్స్ చెబుతూ పూరి జగన్నాథ్... చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మీరొక డ్రగ్ లాంటి వ్యక్తి అంటూ కితాబిచ్చారు. ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదలచేయనున్నారు.





Untitled Document
Advertisements