నడీరోడ్డుపై నోట్ల వర్షం!

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 09:07 PM

నడీరోడ్డుపై నోట్ల వర్షం!

అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో బుధవారం ఓ సంఘటన చోటుచేసుకుంది. నడీరోడ్డుపై నోట్ల వర్షం కురిసింది. పూర్తి వివరాల ప్రకారం...ఆర్మీ లారీలో 1.75 లక్షల డాలర్లు(రూ. 1.10 కోట్లను)ను తీసుకెళ్తుండగా, వెనక తలుపు తెరుచుకోవడంతో నోట్ల కట్టలు రోడ్లపైన పడిపోయాయి. దీనికి తోడు గాలిదుమారం కూడా లేచింది. ఆ రోడ్డంతా నోట్లు కొట్టుకుంటూ పోయాయి. జనం కార్లు దిగి మరీ డబ్బు ఏరుకుని జేబుల్లో వేసకున్నారు. ఫోన్లు చేసి దగ్గర్లోని వారికి విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది తేరుకునే లోపే నోట్లు జనం జేబుల్లోకి వెళ్లిపోయాయి. అక్కడక్కగా పడిన కొంత మొత్తాన్ని ఏరుకుని ఏడుపు ముఖాలతో వెళ్లిపోయాయి. తాము తీసుకెళ్తున్న డబ్బులో కొంత మాత్రమే తిరిగి దక్కిందని చెప్పారు.

Untitled Document
Advertisements