నష్టాల్లో తేలుతున్న యస్ బ్యాంక్

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 04:15 PM

నష్టాల్లో తేలుతున్న యస్ బ్యాంక్

ప్రముఖ ప్రైవేటురంగ సంస్థ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో తీవ్రంగా నష్టపోయింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో యస్ బ్యాంక్ నికర లాభం 91 శాతం క్షీణించి రూ. 113.80 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) మాత్రం 3 శాతం పెరిగి రూ. 2281 కోట్లకు చేరింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్‌పిఎలు(నిరర్థక ఆస్తులు) 3.22 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పిఎలు 1.86 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. ఇక నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.1 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాలను యస్ బ్యాంకు మార్కెట్లు ముగిశాక విడుదల చేసింది. ఎన్‌ఎస్‌ఇలో యస్ బ్యాంక్ షేరు 5 శాతం నష్టపోయి రూ.98.40 వద్ద స్థిరపడింది.





Untitled Document
Advertisements