మా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించండి!!

     Written by : smtv Desk | Fri, Jul 19, 2019, 11:20 AM

మా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించండి!!

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో హైడ్రామా నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ సభ్యులు, విశ్వాసపరీక్షను వాయిదా వేసేందుకు పన్నాగాలు పన్నుతోందని బీజేపీ సభ్యులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సభ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అంతకుముందు, కాంగ్రెస్ సభ్యుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ, తమ సభ్యులను అసెంబ్లీకి రానీయకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కలిసే ప్రయాణం చేశారని, వారిలో ఒకరైన శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలోని స్ట్రెచర్ పై కన్పించారంటూ అందుకు సంబంధించిన ఓ ఫొటోను స్పీకర్ కు చూపించారు. మిగిలిన వారు ఏమయ్యారో తెలియదని, తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని స్పీకర్ ను కోరారు.

Untitled Document
Advertisements