జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసిసి!

     Written by : smtv Desk | Fri, Jul 19, 2019, 12:21 PM

జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసిసి!

ఐసిసి జింబాబ్వే క్రికెట్‌కు షాకిచ్చింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను సస్పెండ్ చేసింది. ఐసిసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.4 సి, డి లను ఉల్లంఘించినందుకు ఆ జట్టుపై వేటేసింది. నిబంధనలకు విరుద్ధంగా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై అక్కడి ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ఐసిసి ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం జింబాబ్వే జోర్డులోని ఎన్నికైన సభ్యులను ప్రభుత్వ సంస్థ స్పోర్ట్స్ అండ్ రీసెర్చ్ కమిటీ సస్పెండ్ చేయడంతో ఐసిసి చర్యలకు దిగింది. జింబాబ్వే క్రికెట్ పై నిషేదం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఐసిసి తాజా నిర్ణయంతో జింబాబ్వే క్రికెట్ బోర్డుకు నిధులు నిలిచిపోయాయి. అంతేకాకుండా ఇకపై ఐసిసి నిర్వహించే ఏ టోర్నీలోనూ ఆ జట్టు ఆడడానికి చాన్స్ ఉండదు. క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు ఐసిసి చెప్పింది. కాగా, మూడు నెలల్లో బోర్డు సభ్యలను తిరిగి నియమించాలని గడువు విధించింది.





Untitled Document
Advertisements