బోనాలు...సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 06:02 PM

బోనాలు...సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!

ఆదివారం (జూలై21) బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లో పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉజ్జయిని మహంకాళి బోనాలను సజావుగా సాగించడంతోపాటు, వాహనదారులు ఇబ్బంది పడకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని నగర సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వివిధ ప్రాంతాల్లో పార్కింగ్‌ స్లాట్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు వీటిని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.ఈ నెల 21 ఆదివారం(రేపు) ఉదయం 4 గంటల నుంచి 22వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆంక్షలు::టొబాకో బజార్‌ హిల్‌స్ట్రీట్‌ నుంచి జనరల్‌బజార్‌ వరకు, రాంగోపాల్‌పేట పోలీ్‌సస్టేషన్‌ నుంచి బాటా ఎక్స్‌రోడ్స్‌ వరకు, మహంకాళి టెంపుల్‌ నుంచి అడివయ్య క్రాస్‌రోడ్స్‌, జనరల్‌బజార్‌ వరకు వాహనాలను అనుమతించరు.కర్బలామైదాన్‌ వైపునుంచి సికింద్రాబాద్‌ వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రాణిగంజ్‌ ఎక్స్‌రోడ్స్‌ నుంచి మినిస్టర్‌ రోడ్‌ మీదుగా రసూల్‌పురా, సీటీవో, వైఎంసీఏ క్రాస్‌రోడ్స్‌, సెయింట్‌జాన్స్‌ రోటరీ, గోపాలపురం మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లాలి.సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆల్ఫాహోటల్‌ నుంచి, గాంధీ క్రాస్‌రోడ్స్‌, సజ్జన్‌లాల్‌ స్ట్రీట్‌, ఘాస్‌మండి, బైబిల్‌హౌస్‌ మీదుగా కర్బలామైదాన్‌ వైపు వెళ్లాలి.బైబిల్‌ హౌస్‌ నుంచి వచ్చే వాహనాలను ఘాస్‌మండీ నుంచి హిల్‌స్ట్రీట్‌ వైపు వెళ్లాలి.ఎస్‌బీహెచ్‌ చౌరస్తా, ప్యారడైజ్‌ నుంచి ఆర్‌పీ రోడ్‌ వైపునకు వచ్చే వాహనాలను ప్యాట్నీ చౌరస్తా మీదుగా క్లాక్‌టవర్‌ వైపు వెళ్లాలి. సీటీవో నుంచి ఎంజీ రోడ్‌వైపునకు వచ్చేవాహను ప్యారడైజ్‌ మీదుగా సింథీకాలనీ, మినిస్టర్‌రోడ్‌, రాణిగంజ్‌, కర్బలామైదాన్‌ వైపు వెళ్లాలి. సోమవారం....సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సెయింట్‌మేరీస్‌ రోడ్‌లో వాహనాలను అనుమతించరు.హకీంపేట, బోయినపల్లి, బాలానగర్‌, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లే బస్సులు క్లాక్‌టవర్‌ వద్దే ఆగి, తిరిగి వెళ్లాలి. ఇక పార్కింగ్....రాణిగంజ్‌ వైపునుంచి వచ్చేవాహనాలు ఆదయ్య క్రాస్‌రోడ్స్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో..సెయింట్‌జాన్స్‌ రోటరీ, స్వీకార్‌ ఉపకార్‌, ఎస్‌బీహెచ్‌ వైపునుంచి వచ్చే వాహనాలు హరిహర కళాభవన్‌, మహబూబియా కాలేజీల్లో...కర్బలామైదాన్‌, బైబిల్‌హౌస్‌, ఘాస్‌మండీ వైపు నుంచి వచ్చేవాహనాలను ఇస్లామియా హైస్కూల్లో...సుభా్‌షరోడ్‌ నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్‌ జింఖానా గ్రౌండ్స్‌ ప్రాంతంలో, మంజు థియేటర్‌ వైపునుంచి వచ్చేవారు అంజలీ థియేటర్‌ వద్ద.





Untitled Document
Advertisements