పరిగెడుతూనే ఉన్న పసిడి...మరో రూ.300 పెంపు

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 01:07 PM

పరిగెడుతూనే ఉన్న పసిడి...మరో రూ.300 పెంపు

బుధవారం(ఆగస్ట్14) కూడా పసిడి పరిగెడుతూనే ఉంది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరుగుదలతో రూ.39,490కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పెరుగుదలతో రూ.36,120కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మరింత ఎక్కువగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,743 పెరుగుదలతో రూ.47,265కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.38,000కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పెరుగుదలతో రూ.36,900కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.2,743 పెరుగుదలతో రూ.47,265కు చేరింది.





Untitled Document
Advertisements