ఇన్వెస్ట్‌మెంట్లలో దూసుకెళ్తున్న స్మిత్

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 04:42 PM

ఇన్వెస్ట్‌మెంట్లలో దూసుకెళ్తున్న స్మిత్

ఆస్ట్రేలియా క్రికటర్ స్టీవ్ స్మిత్‌ వరుస సెంచరీలతో ఒంటి చేత్తో ఆస్ట్రేలియకు విజయాన్ని అందించి అదరగొడుతూ ఇన్వెస్ట్‌మెంట్లలోనూ దూసుకెళ్తున్నాడు. స్మిత్ 2015 జూలైలో మ్యాట్రస్ తయారీ కంపెనీ కోయలా మ్యాట్రస్‌లో 1,00,000 డాలర్లు ఇన్వెస్ట్ చేశాడు. ఈ మొత్తంతో కంపెనీలో ఆయనకు దాదాపు 10 శాతం వాటా లభించింది. నాలుగేళ్లలోనే ఈ మొత్తం ఏకంగా 12.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.85 కోట్లు) పెరిగింది. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ (ఏఎఫ్ఆర్) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు ఆ మ్యాట్రస్ కంపెనీ విలువ 150 మిలియన్ డాలర్లకు చేరింది. దీనికి 2 లక్షలకు పైగా కస్టమర్లు ఉన్నారు. ఇకపోతే స్టీవ్ స్మిత్ కోయలా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. స్మిత్ క్రికెట్‌లో సంపాదించిన దాని కన్నా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారానే భారీగా అర్జించారు. ఏఎఫ్ఆర్ యంగ్ రిచ్ లిస్ట్‌లో స్టీవ్ స్మిత్ సంపద విలువ 31 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చు. ఈ జాబితా ఈ ఏడాది అక్టోబర్ విడుదల కానుంది. స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా గతేడాది ప్రారంభంలో ఏడాదిపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ ఇందుకు కారణం. డేవిడ్ వార్నర్, బెన్ క్రాఫ్ట్ కలిసి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయం అప్పటి టీమ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు కూడా తెలుసు. అయినాకూడా అడ్డు చెప్పలేదు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారితోపాటు స్టీవ్ స్మిత్‌పై ఏడాదిపాటు నిషేధం విధించింది.





Untitled Document
Advertisements