టెక్ పార్క్‌ను కొనుగోలు చేసిన కేఫ్ కాఫీ డే

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 05:17 PM

టెక్ పార్క్‌ను కొనుగోలు చేసిన కేఫ్ కాఫీ డే

కేఫ్ కాఫీ డే గ్రూప్ బెంగళూరులో 100 ఎకరాలలో విస్తరించి ఉన్న టెక్ పార్క్‌ను రూ.2,600- 3,000 కోట్లకు కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన ఆమోదాల ప్రక్రియ 30 నుంచి -45 రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో టెక్ పార్క్ విషయమై కాఫీడే, బ్లాక్‌స్టోన్‌ల మధ్య చర్చలు జరగ్గా అవి విఫలమయ్యాయి. కాఫీడే వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ మృతి నేపత్యంలో బోర్డు మళ్లీ వీటిని పరిశీలించింది. గత రెండు వారాలుగా బ్లాక్‌స్టోన్‌తో చేపట్టిన చర్చలు కొలిక్కివచ్చాయి. బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ 100 ఎకరాలలో విస్తరించి ఉండగా, దీనికి మైండ్‌ట్రీ వంటి అనేక ఐటి కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి.కాఫీ డే మరో అనుబంధ సంస్థ ఆల్ఫాగ్రెప్ సెక్యూరిటీలను విక్రయించాలని నిర్ణయించింది. ఇల్యూమినాటి సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ .28 కోట్లకు విక్రయించనున్నారు. ఈ ఒప్పందాల నుండి వచ్చే మొత్తంతో అప్పులు తిరిగి చెల్లించడానికి సహాయపడుతుందని కాఫీ డే చెబుతోంది. ఇది సంస్థ ఆపరేషన్‌ను సులభతరం చేస్తుంది. దీంతో కస్టమర్లు, ఉద్యోగులు, రుణదాతలు, వాటాదారుల ప్రయోజనాలు కాపాడవచ్చని సంస్థ భావిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, కాఫీ డే గ్రూప్ రుణం 6,547 కోట్లు. సంస్థ వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ్ మృతదేహం జూలై 31న నదిలో లభించింది. ఆయన రాసిన లేఖలో రుణగ్రహీతల ఒత్తిడి గురించి ప్రస్తావించారు. ఎవి రంగనాథ్ ప్రస్తుతం కాఫీ డే తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు.





Untitled Document
Advertisements